పరమ పిసినారి జమీందారు సర్వారాయుడికి ఎప్పుడా గుడికి వెళ్తే పూజారికి దక్షిణగా ఏదైనా ఇవ్వటం, దేవునికి కొబ్బరికాయ పగటకొట్టడం, పాదరక్షల కాపాల కుర్రానికి ఏదైనా ఇవ్వడం ఇష్టముండేది కాదు. జమీందారు పిసినారితనం భాగా ఎరిగిన సోమనాథ శాస్త్రీ ఆయనకు నోరెత్తి ఏమీ అడిగేవాడు కాదు.
ఓ మహాశివరాత్రి పర్వదినాన జమీందారు సర్వారాయుడు మొదట వ్యక్తిగా గుడికి రావడమే కాకుండా పూజారి శాస్త్రీకి ఒక కానీ దక్షిణగా వేశాడు. అంత చిన్న బోణితో మనసు బాధపడ్డ పూజారిశాస్త్రి ‘‘జమీందారుతో తమవంటి గొప్పవారి నుండి కానీ,’’ దక్షిణగా స్వీకరించడం నాకు ఎంతో అనమానంగా ఉంది.! దయచేసి మరొక కానీ దక్షిణగా ఇవ్వండి!’’ అన్నాడు.
ఆ మాటలతో ఒళ్ళుమండిన సర్వారాయుడు ఇంకొక కానీ ఇచ్చి మళ్ళీ రెండోసారి మిమ్మల్ని అవమానపరచటం నాకూ ఇష్టం లేదు’’ అంటూ ఇచ్చిన కానీ వెనక్కీ తీసుకుని గుడి బయటకు నడిచాడు.
మరింత సమాచారం తెలుసుకోండి: